జ్యోతిష్యం : కుంభ రాశిలో ఐదు గ్రహాల ఎఫెక్ట్ వల్లే ఇరాన్ యుద్ధం మొదలైందా.. ముందే ఊహించిన పండితులు..!

జ్యోతిష్యం : కుంభ రాశిలో ఐదు గ్రహాల ఎఫెక్ట్ వల్లే ఇరాన్ యుద్ధం మొదలైందా.. ముందే ఊహించిన పండితులు..!

జ్యోతిష్య పండితుల అంచనాలు నిజమే అయ్యాయా.. గ్రహాలు.. వాటి స్థానాలు మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటుంది. గ్రహణాల ఎఫెక్ట్​ ఎంతవరకు ఉంటుంది.  కుంభరాశిలో ఐదు గ్రహాలు కలవడం వలనే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్దాలకు కారణమా. ఈ విషయంలో జ్యోతిష్యనిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

కుంభరాశిలో ఇప్పటికే (ఫిబ్రవరి 28 వ తేది నాటికి)  రాహువు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఇప్పుడు అంటే ఫిబ్రవరి 28న మరో అత్యంత శక్తివంతమైన గ్రహాలు .. కుజుడు..చంద్రుడు కూడా వచ్చారు.  ఇవన్నీ అత్యంత శక్తికలిగి ఉంటాయని చెబుతున్నారు. జ్యోతిష్య పండితులు.. 

జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఐదు గ్రహాల్లో  ఏ రెండు గ్రహాలు కలిసినా విధ్వసం లాంటి ఘటనలు తప్పవని చెబుతున్నారు.  నిన్న ( ఫిబ్రవరి 27) పాకిస్తాన్​.. ఆఫ్ఘపనిస్తాన్​ యుద్దం ప్రారంభమైంది.  మళ్లీ ఈ రోజు ( ఫిబ్రవరి28) ఇరాన్​.. ఇజ్రాయిల్​​ క్షిపణులతో దాడులకు దిగాయి.  అమెరికా కూడా యుద్ద సన్నాహాలకు రడీ అవుతుందని సమాచారం అందుతుంది.  

ఈ పరిణామాలన్నీ  కుంభ రాశిలో ఐదు గ్రహాలు.. చివరి రోజు కుజుడు రాకతో ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైందని .. ఇలాంటి సమయాల్లో వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా, దేశ–ప్రపంచ స్థాయిలో కూడా మార్పులు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

అనుకున్నట్లే జరిగిందా.. 

కుంభరాశిలో ఈ గ్రహస్థితి మార్చి వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు . ఈ క్రమంలోనే  ఫిబ్రవరి 28వ తేదీన.. కుంభంలోకి ముఖ్యంగా చంద్రుడితోపాటు కుజుడు రాకతో ఈ పరిణామాలు జరిగాయా అంటే అవునని జ్యోతిష్య పండితులు అంటున్నారు..కుజుడు ఫోర్స్ బుల్ ప్లానెట్.. ఆయనది దూకుడు స్వభావం గల రాశి.. ఈ ప్రభావంతోనే.. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసిందా.. అనే అంశం ఇప్పుడు ఇదే మన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది...